హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ

TG: తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది. కర్ణాటక రూ.4,33,326 తలసరి ఆదాయంతో దేశంలోనే తొలిస్థానంలో ఉంది. ఇక ఏపీ తలసరి ఆదాయం 10.42 శాతం వృద్ధి రేటుతో రూ. 2,66,699 నుంచి 2,94,507కు పెరిగింది. దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది.