కేరళంలోని పతనంతిట్ట జిల్లాలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే 300 మి.మీ(30 CM)లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. పంబా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పతనంతిట్ట జిల్లాలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న బాధితులను పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వార్తలు
కేరళంలో వర్ష బీభత్సం.. ఉప్పొంగిన పంబా నది


