హైదరాబాద్: 28°C
వార్తలు

హైడ్రాపై సీఎం రేవంత్ ప్రశంసలు

TG: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, జలవనరుల పునరుజ్జీవానికి.. హైడ్రా చేస్తున్న కృషి ప్రశంసనీయమని CM రేవంత్ రెడ్డి అన్నారు. చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని 'X' వేదికగా వెల్లడించారు. భావితరాలకు స్వచ్ఛమైన, భద్రమైన భవిష్యత్తును అంకితం చేయడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.