AP: ధవళేశ్వరం నుంచి భారీగా వరదను దిగువకు విడుదల చేయడంతో.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉద్ధృతి పెరిగింది. దీంతో అనేక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101కు సంప్రదించాలని అధికారులు సూచించారు.
వార్తలు
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో లంక గ్రామాలు


