హైదరాబాద్: 28°C
వార్తలు

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

AP: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ 170 గేట్లను ఎత్తి 13.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.