AP: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదల్లేదు. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 842.30 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా.. ప్రస్తుతం 65.32 TMCల నీరు మాత్రమే నిల్వ ఉంది.
వార్తలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద


