హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై పూనావాలా సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఒక నియంతగా ఎలా మారాలో కూడా ప్రధానికి తెలియదన్నారు. ఈ విషయంలో తను పూర్తిగా నిరాశ చెందినట్లు చెప్పారు. తమ తల్లిని దూషించిన వారిని క్షమించటమే మోదీకి తెలుసని పేర్కొన్నారు.