యూపీ బలరాంపూర్ పరిధిలో నలుగురు దారుణ హత్య కలకలం రేపింది. జోహ్నో గ్రామంలో దంపతులు, ఇద్దరు పిల్లలను దుండుగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో భజరంగ్ గిరి, భార్య కోమలి, కుమార్తె శ్రద్ధ, ఏడాది బాలుడు జైదీప్ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
యూపీలో నలుగురి దారుణ హత్య


