ADB: ఆదిలాబాద్ పట్టణంలో MRPS ఆధ్వర్యంలో అన్న భావు సాఠే 106వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. తన సాహిత్యంతో సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అన్న భావు సాఠే అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
'అన్న భావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్టించాలి'


