హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ ఎన్నికలకు బహుజన్ వర్కర్స్ యూనియన్ సన్నద్ధం

HYD: హైదరాబాద్‌ లక్డికాపూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకులు వ్యూహరచన చేశారు. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మేనిఫెస్టో రూపొందించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు.