హైదరాబాద్: 28°C
వార్తలు

క్లౌడ్‌బరస్ట్‌.. నిలిచిన రాకపోకలు

జమ్మూకశ్మీర్ కిశ్త్‌వాఢ్ జిల్లాలో తెల్లవారుజామున మేఘ విస్ఫోటం జరిగింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వర్షాల వల్ల కొండ చరియలు విరిగి పడడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు ప్రాంతాల్లో రోడ్లు బురదమయమయ్యాయి. కిశ్త్‌వాఢ్, దోడా, రాంబన్ జిల్లాల్లో నదులు పొంగుతుండడంతో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.