హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ ఓదార్పు

నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తమ బిడ్డను కోల్పోవడం కంటే బాధాకరమైనది మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మన విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైందని విమర్శించారు. పేపర్లు లీక్ అయ్యి, రద్దు అవుతున్నాయన్నారు. తద్వారా ఏళ్ల తరబడి విద్యార్థులు చేసిన కృషి వృథా అవుతుందని పేర్కొన్నారు.