జాతీయత నిర్ధరించుకున్నాకే విదేశీయులను వారి స్వదేశాలకు డిపోర్ట్ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఎవరైనా వ్యక్తుల జాతీయతను ధృవీకరించడానికి విదేశాలు అంగీకరించకపోతే వారిని బహిష్కరించడం సాధ్యం కాదని పేర్కొంది. ఒక విదేశీయుడికి శిక్ష లేదా కోర్టు విచారణలు పూర్తయిన తర్వాత.. ఆ వ్యక్తి వద్ద పాస్ పోర్ట్ ఉండి, వారిపై మరే ఇతర కేసులు లేకపోతే వారిని బహిష్కరించవచ్చని చెప్పింది.
వార్తలు
'జాతీయత పరిశీలించిన తర్వాతే డిపోర్టేషన్'


