హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ న్యాయపోరాటానికి ఫలితంపై పొన్నం హర్షం

సుప్రీంకోర్టులో గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పుపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేంద్రంతో చర్చలు, న్యాయపోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారని కొనియాడారు. ప్రాజెక్టుల పనులు వేగవంతమై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాయని తెలిపారు.