అసోంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 82 మంది మృతి చెందారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయగా.. అందులో 13 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
వరద విలయతాండవం.. 82 మంది మృతి


