హైదరాబాద్: 28°C
వార్తలు

అది మన అదృష్టం: దోవల్

దేశం ప్రస్తుతం అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని.. దీన్ని అనేక వ్యతిరేక శక్తులు జీర్ణించుకోలేక అనేక కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. వారి వలలో యువత పడొద్దని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వంటి బలమైన నాయకత్వం ఉండటం మన అదృష్టమని తెలిపారు.