ప్రకాశం: దర్శి మార్కెట్ యార్డ్‌లో అలిమ్కో సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒంగోలు ఎంపీ శ్రీనివాసుల రెడ్డి సైకిళ్లు అందజేశారు. ప్రజాసేవలో భాగస్వామ్యమవుతున్న అలిమ్కో సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు.
వార్తలు
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ: ఎంపీ


