హైదరాబాద్: 28°C
వార్తలు

నేతలకు వలపువల విసిరేందుకు ఉగ్రకుట్ర

రాజకీయ నేతలకు వలపు వల విసిరేందుకు పన్నిన ఉగ్రకుట్రను బెంగాల్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు జార్ఖండ్‌కు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. జైషే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ అనే వ్యక్తికి ఆమె సహకరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హమీమను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ సాయంతో హమీమ నేతలకు వలపు వల విసిరి కీలక సమాచారాన్ని పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.