హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన'

KMR: నిజాంసాగర్ మండలం బంజేపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్‌రావు  ప్రాముఖ్యతను వివరించారు. శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించి, తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.