SRD: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి ఇవాళ కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, వైద్య సేవలు ప్రజలకు నాణ్యంగా అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.
వార్తలు
PHCలో DMHO ఆకస్మిక తనిఖీ


