MDK: చిన్నశంకరంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహశీల్దార్ మాలతి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి చెందారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ గీతను ఆదేశించారు.
వార్తలు
కేజీబీవీలో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ


