ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పదవీ విరమణ పొందిన ఇద్దరు ఎస్సైలు, ఒక ఆర్ఎస్సైకి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ పి.జగదీష్ వారిని శాలువాలతో సన్మానించారు. దశాబ్దాల పాటు క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించిన వీరి కృషి అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ తదుపరి జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.
వార్తలు
పదవీ విరమణ పొందిన పోలీసులకు ఘన సన్మానం


