హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి'

ADB: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం బోరాజ్ మండలంలోని పిప్పరవాడ గ్రామంలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి SP వాలిబాల్ ఆడి ఉత్సాహం నింపారు. గ్రామస్తులు గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.