WNP: పట్టణంలోని బసవన్నగడ్డ అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 31వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి రాధాకృష్ణ హాజరై తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే అపోహలను వీడి తల్లిపాలు అందించాలని తల్లులకు సూచించారు. ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి, పోషకాహారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
వార్తలు
VIDEO: 'అపోహలను వీడి తల్లిపాలు అందించాలీ'


