WNP: పట్టణంలోని 7వ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, నవజాత శిశువులకు తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలత, ఆశా వర్కర్ జ్యోతి పాల్గొన్నారు.
వార్తలు
'తల్లిపాలపై అవగాహన కార్యక్రమం'


