హైదరాబాద్: 28°C
వార్తలు

E20 పెట్రోల్ విధానంపై కేజ్రీవాల్ మండిపాటు

E-20 పెట్రోల్ విధానంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పెట్రోల్ వాడకం వల్ల మైలేజీలో 2 నుంచి 5 శాతం తేడా ఉంటుందని ఒక మంత్రిత్వ శాఖ చెబితే, మరో శాఖ మాత్రం 4 శాతం అని చెబుతుందని మండిపడ్డారు. E-20 వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ విధానాన్ని ఎందుకు బలవంతంగా అమలు చేస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.