హైదరాబాద్: 28°C
వార్తలు

రాజులగుడాలో రోడ్డు కష్టాలు

ADB: ఉట్నూర్ మండలంలోని మారుమూల గ్రామం రాజులగుడా ప్రజలు రహదారి లేక నరకయాతన పడుతున్నారు. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఉన్న ఒక్క మట్టి రోడ్డు వర్షం పడితే చిత్తడిగా మారి రాకపోకలకు పూర్తిగా నిరోధకంగా మారుతోంది. తక్షణమే స్పందించి నూతన రోడ్డును మంజూరు చేయాలని అధికారులను గ్రామస్థులు వేడుకుంటున్నారు.