హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని నోట పైడితల్లి అమ్మవారు

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించి సభికులను ఆకట్టుకున్నారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ ఆయన ప్రజలను అభివాదం చేయగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారిని ఆయన నమస్కరించుకున్నారు.