హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లిపాలు పిల్లలకు శ్రీరామరక్ష

AKP: తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష అని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్ రంజాన్ బీబీ అన్నారు. శనివారం పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. దీనిలో భాగంగా తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలన్నారు. తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. పిల్లలకు బయట ఆహారం పెట్టవద్దన్నారు.