హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నవరంలో కూటమి రెండేళ్ల పాలనపై ప్రచారం

KKD: శంఖవరం మండలం అన్నవరంలో కూటమి రెండేళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.