హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలకు రూ.16.80 లక్షల నిధులు

SRD: జిల్లాలోని 42 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.16.80 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. మాథ్స్, సైన్స్ కిట్ల కొనుగోలు కోసం ఒక్కో పాఠశాలకు రూ.40 వేల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. మాథ్స్, సైన్స్, సీనియర్ టీచర్‌తో కమిటీని ఏర్పాటు చేసి ప్రయోగ పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు.