భూపాలపల్లి నియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లంతా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అవసరమైన ధ్రువపత్రాలను అధికారులకు సమర్పించి పేరు నమోదు, మార్పులు, సవరణలు గడువు ముగిసేలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు.
వార్తలు
'SIR ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి'


