హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పొడిగింపు

SKLM: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి వరి మినహా ఇతర నోటిఫై చేసిన పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. పంటల బీమా పథకం ద్వారా రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.