హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు చెన్నైలో రాహుల్ గాంధీ పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వనున్నారు. అలాగే, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు.