ముంబైలో డంపింగ్ యార్డ్ వద్ద కాలుష్యం, విష వాయువులకు సంబంధించిన పిటిషన్లపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై మండిపడింది. సొంత ఊర్లో నిబంధనలు పట్టించుకోకుండా విదేశాల్లో మాత్రం పరిశుభ్రత పాటిస్తారంటూ చురకలంటించింది. స్వచ్ఛమైన వాతావరణాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని స్పష్టం చేసింది.
వార్తలు
'ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా..?'


