హైదరాబాద్: 28°C
వార్తలు

'నాకు 15 ఏళ్లే.. మోదీజీ క్షమించండి'

ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా ప్రధాని మోదీని దూషించేలా మాట్లాడినందుకు ఓ యువతిపై కేసు నమోదైంది. దీంతో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్న వీడియో SMలో వెలుగులోకి వచ్చింది. 'నిరసనలో కొందరి ప్రభావంతో నేను ప్రధాని గురించి చెడుగా మాట్లాడాను. నా వయసు 15 ఏళ్లే. దేశం మొత్తానికి నేను క్షమాపణ చెబుతున్నాను. దీనిని మొదటి, చివరితప్పుగా భావించి నన్ను క్షమించండి' అంటూ వేడుకుంది.