హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

MDK: పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ ప్రజలకు మెరుగైన సేవలకు నాందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫటీగ్ డ్యూటీలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ ఆవరణలు, కార్యాలయ పరిసరాలు, రికార్డు గదులు శుభ్రం చేశారు.