హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 1,51,366 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 838.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 59.16 టీఎంసీలుగా నమోదైంది.