హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ

PLD: నకరికల్లు మండల కేంద్రంలోని ఐదు బొమ్మల సెంటర్, రంగా సెంటర్లలో శనివారం ఎంపీడీఓ కాసయ్య, పీడీఓ కొమ్మవరపు అప్పారావు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెన్షన్ పొందిన వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.