హైదరాబాద్: 28°C
వార్తలు

కంభంపాడులో ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన

NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లే మార్గానికి అడ్డుగా మట్టి వేసి నీటి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తున్నారనే ఫిర్యాదుపై ఈ చర్య తీసుకున్నారు. అడ్డంకులను తక్షణమే తొలగించి, నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆర్డీవో ఆదేశించారు.