KMR: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు KMR జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పలు కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కోరారు.
వార్తలు
ఇంటర్ అడ్మిషన్లకు గడువు పొడగింపు


