ATP: జిల్లాలోని పామిడి పట్టణం వాణినగర్ సౌదుర్తి ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం బోనాల ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు కొత్త కుండల్లో తీపి అన్నం నింపి, అలంకరించి బోనాలతో డప్పుల మోతల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. పూజారి రామేశ్వరమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
'వైభవంగా సౌదుర్తి ఎల్లమ్మ బోనాల ఉత్సవం'


