MDK: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కలెక్టర్ క్యాంప్ నుంచి గూగుల్ మీట్ నిర్వహించి మండలాల వారీగా పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్లో 9391942254 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్తలు
భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు


