హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధురాలు మిస్సింగ్.. కేసు నమోదు

SRD: పటాన్చెరుకు చెందిన పెద్దబోయిన శివమ్మ (82) జూలై 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు పెద్దబోయిన రాజు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా పటాన్చెరు పోలీసులకు సమాచారం అందించాలని ఇన్స్ పెక్టర్ రవీందర్ కోరారు.