హైదరాబాద్: 28°C
వార్తలు

బాల పురస్కార్ గడువు పొడిగింపు

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026 అవార్డుల కోసం నామినేషన్ల గడువును ఆగస్టు 15 వరకు కేంద్రం పొడిగించింది. ధైర్యసాహసాలు, సామాజిక సేవ, కళలు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో ప్రతిభ కనబరిచిన పిల్లలకు ఈ అవార్డులను అందజేస్తారు. జూలై 31 2026 నాటికి ఐదేళ్లు పైబడి.. 18 ఏళ్ల వయస్సు మించని భారత పౌరులు ఈ అవార్డులకు అర్హులని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.