SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ సమీపంలోని మిడ్ మానేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటిమట్టం 309.97 మీటర్లు, నిల్వ 11.301 టీఎంసీలుగా నమోదైంది. జలాశయంలోకి 18,746 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 112 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో మాత్రమే ఉంది. స్పిల్‌వే గేట్లు తెరవలేదు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
మిడ్ మానేరు జలాశయానికి భారీగా వరద నీరు


