హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పలమనేరు పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్‌లో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో పాల్గొనే వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఆపరేషన్‌లు కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.