హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలకు పెంకుటిల్లు కూలింది.. కుటుంబం నిరాశ్రయం

BHPL: మహాముత్తారం మండలం యామన పల్లిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యల రాజక్క–వెంకయ్య దంపతుల పెంకుటిల్లు శుక్రవారం పూర్తిగా కూలిపోయింది. గోడలు, పైకప్పు నేలమట్టం కావడంతో కుటుంబం నిరాశ్రయులైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి, పక్కా ఇల్లు మంజూరు చేయాలన్నారు.