MDK: మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే వెనువెంటనే షీ టీంలను సంప్రదించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. జూలై నెలలో నిర్వహించిన తనిఖీల్లో 77 మంది వేధింపుదారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. నిబంధనలు మీరిన 9 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేయగా, మహిళల భద్రతపై 46 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు.
వార్తలు
ఈవ్‌టీజర్లకు షీ టీం చెక్


