హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురంలో ప్రధాని షెడ్యూల్ ఇలా

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10:45 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. 11:30 నుంచి 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి పనుల ప్రారంభం, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు.